పేకాట శిబిరంపై దాడులు.. ఐదుగురు అరెస్ట్ | five arrested in poker camp attacks | Sakshi
Sakshi News home page

పేకాట శిబిరంపై దాడులు.. ఐదుగురు అరెస్ట్

Mar 30 2016 8:07 AM | Updated on Aug 21 2018 5:52 PM

రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఐదుగురు పేకాట రాయుళ్లను పోలీసులు బుధవారం తెల్లవారుజామున అరెస్ట్ చేశారు.

రాజేంద్రనగర్: రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఐదుగురు పేకాట రాయుళ్లను పోలీసులు బుధవారం తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. బుద్వేల్ రైల్వే స్టేషన్ సమీపంలోని లారీ పార్కింగ్ పక్కన కట్టెల గోదాములో పేకాట శిబిరం నడుస్తుందన్న సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. ఐదుగుర్ని అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.69,600 నగదు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement