స్పిన్నింగ్ మిల్లులో భారీ అగ్ని ప్రమాదం | fire accident in spinning mill | Sakshi
Sakshi News home page

స్పిన్నింగ్ మిల్లులో భారీ అగ్ని ప్రమాదం

Aug 5 2015 9:15 PM | Updated on Sep 5 2018 9:45 PM

రంగారెడ్డి జిల్లా తాండూరు మండలం గోపన్నపల్లిలో రాజ్‌వీర్ స్పిన్నింగ్ మిల్లులో బుధవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం జరిగింది.

తాండూరు: రంగారెడ్డి జిల్లా తాండూరు మండలం గోపన్నపల్లిలో రాజ్‌వీర్ స్పిన్నింగ్ మిల్లులో బుధవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం జరిగింది. మిల్లు గోదాములో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో భారీగా మంటలు పైకి లేచాయి. గోదాములో డీజిల్ కూడా నిల్వ ఉంచడంతో మంటలు మరింత ఎగసి పడుతున్నాయి.

సమాచారం తెలుసుకున్న అగ్ని మాపక సిబ్బంది ఫైరింజన్లతో వచ్చి మంటలను విస్తరించకుండా నియంత్రించేందుకు శ్రమిస్తున్నారు. ఈ ప్రమాదంలో గోదాములో నిల్వ ఉంచిన రూ.2 కోట్ల విలువైన దారం ఉండలు దగ్ధం అయి ఉంటాయని భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియరాలేదు.

Advertisement
 
Advertisement
Advertisement