‘మాకు మంచిర్యాలే మంచిది’ | Dandepalli residents protest | Sakshi
Sakshi News home page

‘మాకు మంచిర్యాలే మంచిది’

Jul 1 2016 7:49 PM | Updated on Aug 17 2018 2:53 PM

తమ మండలాన్ని కొత్తగా తలపెట్టిన నిర్మల్ జిల్లాలో కలపవద్దంటూ ఆదిలాబాద్ జిల్లా దండేపల్లిలో ఆందోళన జరిగింది.

తమ మండలాన్ని కొత్తగా తలపెట్టిన నిర్మల్ జిల్లాలో కలపవద్దంటూ ఆదిలాబాద్ జిల్లా దండేపల్లిలో ఆందోళన జరిగింది. వివిధ పార్టీల ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం మండల కేంద్రంలో రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా వారు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దండేపల్లి నుంచి నిర్మల్ దూరం 120 కిలోమీటర్లు కాగా మంచిర్యాల 40 కిలోమీటర్ల దూరంలోనే ఉందని వారు తెలిపారు. ప్రజల సౌకర్యార్థం ప్రతిపాదిత మంచిర్యాల జిల్లాలోనే తమ మండలాన్ని ఉంచాలని వారు డిమాండ్ చేశారు.

 

Advertisement
 
Advertisement
Advertisement