'సీమకు చంద్రబాబు అన్యాయం చేశారు' | cpi leader ramakrishana criticises cm chandra babu | Sakshi
Sakshi News home page

'సీమకు చంద్రబాబు అన్యాయం చేశారు'

Apr 20 2016 7:45 PM | Updated on Jul 28 2018 6:51 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం అనంతపురం జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో హంద్రీ-నీవా ఆయకట్టు సాధనసమితి బహిరంగలేఖ విడుదల చేసింది.

అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం అనంతపురం జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో హంద్రీ-నీవా ఆయకట్టు సాధనసమితి బహిరంగలేఖ విడుదల చేసింది. సీపీఐ నేత రామకృష్ణ, ఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. పట్టిసీమ పేరుతో చంద్రబాబు రాయలసీమకు అన్యాయం చేశారని సీపీఐ నేత ఆరోపించారు. సాగునీటి ప్రాజెక్టులును పక్కనపెట్టి ఇంకుడు గుంతలు నిర్మించడం న్యాయమా అని ఏపీ సీఎం బాబుని ప్రశ్నించారు.

Advertisement
 
Advertisement
Advertisement