కాడెద్దులుగా మారిన దంపతులు
వర్షాభావ పరిస్థితుల కారణంగా కాడెద్దులను సంరక్షించుకోవడానికి రైతులకు కష్టమవుతోంది.
మడకశిర: వర్షాభావ పరిస్థితుల కారణంగా కాడెద్దులను సంరక్షించుకోవడానికి రైతులకు కష్టమవుతోంది. ఈ నేపథ్యంలో మనుషులే కాడెద్దులుగా మారుతున్నారు. ఇందుకు ఉదాహరణ అనంతపురం జిల్లా మడకశిర మండలం గోవిందాపురం గొల్లహట్టి గ్రామానికి చెందిన భార్యాభర్తలు రామలింగప్ప, ఈరమ్మ. వీరు రెండెకరాల్లో వేరుశనగ సాగు చేశారు.
వర్షాభావ పరిస్థితుల కారణంగా పంట ఎండిపోతున్నా కూడా అందులో పెరిగిన కలుపు మొక్కలను తొలగించడానికి ఆ దంపతులు నానా తంటాలు పడుతున్నారు. గురువారం గ్రామ సమీపంలోని తమ వేరుశనగ పంటలో కలుపు మొక్కలను తొలగించడానికి గుంటుకను వారే లాగుతూ సాక్షి కెమెరాకు కనిపించారు.


