తాగునీటి కోసం ఆందోళన | Concern for drinking water | Sakshi
Sakshi News home page

తాగునీటి కోసం ఆందోళన

Mar 6 2017 1:49 AM | Updated on Sep 5 2017 5:17 AM

తాగునీటి కోసం ఆందోళన

తాగునీటి కోసం ఆందోళన

రెండు నెలలుగా తాగునీరు సరఫరా చేయడం లేదని ఆగ్రహించిన మíßహిళలు ఖాళీ బిందెలతో ఆదివారం నిరసన తెలిపారు.

సర్పంచ్‌ ఇంటి ఎదుట మహిళల నిరసన
రెండు నెలలుగా నీరు సరఫరా కాకపోవడంతో ఆగ్రహం


వర్ధన్నపేట : రెండు నెలలుగా తాగునీరు సరఫరా చేయడం లేదని ఆగ్రహించిన మíßహిళలు ఖాళీ బిందెలతో ఆదివారం నిరసన తెలిపారు. మండలంలోని ఇల్లంద ఎస్సీ కాలనీలో కొన్ని కుటుంబాలకు రెండు నెలలుగా నీటి సరఫరా కావడం లేదు. వేసవి రావడంతో సమస్య జఠిలం కాగా, ఆగ్రహించిన మహిళలు ఖాళీ బిందెలతో సర్పంచ్‌ రాయపురం కుమారస్వామి ఇంటికి చేరుకున్నారు.

తాగునీటి సమస్య వెంటనే పరిష్కరించాలంటూ నిరసన తెలిపారు. దీనిపై గ్రామపంచాయతీ కార్యదర్శి అశోక్‌ కాలనీకి నీటి సరఫరాకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని హామీ ఇవ్వడంతో మహిళలు ఆందోళన విరమించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement