మేనకోడలు నిశ్చితార్థానికి వచ్చి వెళ్తుండగా..
హైదరాబాద్ – బెంగళూరు జాతీయ రహదారిపై అమకతాడు టోల్‌గేట్ వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అనంతపురం జిల్లా వాసి మృతి చెందాడు.
– అమకతాడు టోల్‌గేట్ వద్ద దిమ్మెను ఢీకొన్న కారు
– అనంతపురం వాసి మృతి
కృష్ణగిరి: హైదరాబాద్ – బెంగళూరు జాతీయ రహదారిపై అమకతాడు టోల్‌గేట్ వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అనంతపురం జిల్లా వాసి మృతిచెందాడు. అనంతపురం జిల్లా వెలగనూరు మండలం పాతపల్లి గ్రామానికి చెందిన సకలేశ్వరరెడ్డి(57), వజ్రకరూరు మండలం పొట్టిపాడు గ్రామానికి చెందిన విజయప్రకాష్‌రెడ్డి వరుసకు బావబామర్దులు. వీరు కాంట్రాక్టర్లుగా హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. ఆదివారం పొట్టిపాడు గ్రామంలో విజయప్రకాష్‌రెడ్డి కుమార్తె నిశ్చితార్థం నిర్వహించారు. కార్యక్రమం ముగిసిన అనంతరం సోమవారం ఉదయం తిరిగి ఒకే కారులో రెండు కుటుంబాల సభ్యులు హైదరాబాద్‌కు బయలుదేరారు. మార్గమధ్యంలో అమకతాడు టోల్‌గేట్ సమీపంలో రహదారి పక్కన ఉన్న దిమ్మెకు ప్రమాదవశాత్తు కారు ఢీకొంది.
ఈ ప్రమాదంలో ముందు సీట్లో కూర్చున్న సకలేశ్వరరెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రై వింగ్ చేస్తున్న విజయప్రకాష్‌రెడ్డి, ఇతని భార్య, కుమార్తె, సకలేశ్వరరెడ్డి భార్య సుజాతకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే టోల్‌గేట్ సిబ్బంది అంబులెన్స్‌లో వారిని కర్నూలుకు తరలించారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్‌ఐ సోమ్లానాయక్ సంఘటన స్థలానికి చేరుకుని కారులో ఇరుక్కున మతదేహాన్ని బయటికి తీసి పోస్టుమార్టం నిమిత్తం డోన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విజయప్రకాష్‌రెడ్డిని ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి పరామర్శించారు.