'బాబు-పవన్ ల భేటీ వెనుక హైడ్రామా' | c ramachandraiah fire on chandra babu | Sakshi
Sakshi News home page

'బాబు-పవన్ ల భేటీ వెనుక హైడ్రామా'

Nov 14 2015 12:45 AM | Updated on Mar 22 2019 5:33 PM

'బాబు-పవన్ ల భేటీ వెనుక హైడ్రామా' - Sakshi

'బాబు-పవన్ ల భేటీ వెనుక హైడ్రామా'

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ భేటీ కావడం వెనుక పెద్ద హైడ్రామానే నడిచిందని కాంగ్రెస్ నేత సి.రామచంద్రయ్య ఆరోపించారు.

తిరుపతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ భేటీ కావడం వెనుక పెద్ద హైడ్రామానే నడిచిందని కాంగ్రెస్ నేత సి.రామచంద్రయ్య ఆరోపించారు. చిత్తూరు జిల్లా తిరుపతి పట్టణంలో మీడియాతో శుక్రవారం ఆయన మాట్లాడారు. పవన్ రాకకోసం చంద్రబాబే స్వయంగా ప్రత్యేక విమానం ఏర్పాటు చేశారని ఆయన వ్యాఖ్యానించారు.

ఏపీ ముఖ్యమంత్రి సిద్ధం చేసిన స్ర్కిప్ట్ను జనసేన అధ్యక్షుడు పవన్ చదివి వినిపించారంటూ ఆయన మండిపడ్డారు. చంద్రబాబుకు ఏపీలో బలం ఉందని చెప్పుకోవడానికే పవన్ను విజయవాడ రప్పించుకున్నారని ఫైర్ అయ్యారు. త్వరలో చంద్రబాబు బీజేపీకి దూరమవుతారని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement