బస్సు, బైక్‌ ఢీ.. ఒకరి దుర్మరణం | bus and byke accident one die | Sakshi
Sakshi News home page

బస్సు, బైక్‌ ఢీ.. ఒకరి దుర్మరణం

Aug 2 2016 10:57 PM | Updated on Apr 3 2019 7:53 PM

వలిగొండ మండలం గురునాధపల్లి గ్రామానికి చెందిన తోట శేఖర్‌(35) గ్రామ ఉపసర్పంచ్‌గా ఉన్నాడు.

భువనగిరి అర్బన్‌  
 వలిగొండ మండలం గురునాధపల్లి గ్రామానికి చెందిన తోట శేఖర్‌(35)  గ్రామ ఉపసర్పంచ్‌గా ఉన్నాడు. మంగళవారం అతని బాబాయి తోట హరిచంద్రతో కలిసి బైక్‌పై హైదరాబాద్‌ నుంచి భువనగిరికి వస్తున్నాడు. ఈ క్రమంలో పట్టణంలోని టీచర్స్‌ కాలనీ సమీపంలో ఉన్న బైపాస్‌ రోడ్డు వద్దకు రాగానే భువనగిరి నుంచి హైదరాబాద్‌ వైపునకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు రోడ్డు క్రాస్‌ చేస్తుండగా ఢీకొట్టింది. దీంతో బైకుపై ఉన్న ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే చికిత్స నిమిత్తం స్థానిక ఏరియా ఆస్పత్రికి, అక్కడి నుంచి సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శేఖర్‌ మతిచెందాడు. మతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తునట్లు పట్టణ ఎస్‌ఐ మంజునాథ్‌రెడ్డి తెలిపారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement