‘నా చావుకు ఎవరూ కారణం కాదు’ | BTech Student Commits Suicide in Hyderabad | Sakshi
Sakshi News home page

‘నా చావుకు ఎవరూ కారణం కాదు’

Oct 28 2015 11:57 PM | Updated on Nov 6 2018 8:22 PM

‘నా చావుకు ఎవరూ కారణం కాదు’ - Sakshi

‘నా చావుకు ఎవరూ కారణం కాదు’

నా చావుకు ఎవరూ కారణం కాదని సూసైడ్ నోట్ రాసి బీటెక్ విద్యార్థిని ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

నోట్ రాసి బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
అడ్డగుట్ట: నా చావుకు ఎవరూ కారణం కాదని సూసైడ్ నోట్ రాసి బీటెక్ విద్యార్థిని ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.  తుకారాంగేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... అడ్డగుట్ట ఏ సెక్షన్‌కు చెందిన కిషన్ ప్రైవేటు ఉద్యోగి. ఇతని కూతురు శివాణి(20) బీటెక్‌లో ఒక సబ్జెక్టు తప్పడంతో ఇంటి వద్దే ఉంటూ పరీక్షకు సిద్ధమవుతోంది. కాగా, బుధవారం ఇంట్లో ఎవరూలేని సమయంలో శివాణి తన ఇంట్లోని రేకుల షెడ్డుకు ఉన్న ఇనుప రాడ్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

విషయం తెలుసుకున్న శివాణి తల్లిదండ్రులు వెంటనే ఇంటికి వచ్చి విగతజీవిగా పడివున్న కూతుర్ని చూసి గొల్లుమన్నారు. పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించగా.. ఓ పుస్తకంలో శివాణి రాసిన సూసైడ్ నోట్ దొరికింది. అందులో ‘నా చావుకు ఎవరూ కారణం కాదు’ అని రాసి ఉంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement