అమ్మతో ఆడుకుంటూ.. | boy died in auto accident | Sakshi
Sakshi News home page

అమ్మతో ఆడుకుంటూ..

Apr 2 2016 2:11 AM | Updated on Jul 12 2019 3:29 PM

అమ్మతో ఆడుకుంటూ.. - Sakshi

అమ్మతో ఆడుకుంటూ..

అప్పటిదాక తల్లి సంరక్షణలో అ డు కున్న పిల్లాడు అంతలోనే అనంతవాయువుల్లో కలిసిపోయాడు.

ట్రాలీ ఆటో ఢీకొని బాలుడు మృతి
కౌడిపల్లి: అప్పటిదాక తల్లి సంరక్షణలో అ డు కున్న పిల్లాడు అంతలోనే అనంతవాయువుల్లో కలిసిపోయాడు. ఆటో వద్ద సబ్బులు కొనేందుకు వెళ్లిన తల్లివెనకాల ఆటో వరకు వచ్చిన కొడుకు అదే ఆటో ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెం దాడు. ఈ ఘటన కౌడిపల్లి మండలం చిట్కుల్‌లో శుక్రవారం చోటుచేసుకుం ది. ఏఎస్‌ఐ ఖలిమొద్దీన్, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని చిట్కుల్‌లో ట్రాలీ ఆటో ఢీ కొనడం తో గ్రామానికి చెందిన చక్రాల అనిత, సత్యనారాయణ కొడుకు  వెంకటేశ్ (2) అక్కడికక్కడే మృతి చెం దాడు. రంగారెడ్డి జిల్లా పరిగి గ్రామానికి చెందిన ఒంటెద్దు శ్రీనివాస్ గత కొన్నాళ్లుగా కుటుంబ సభ్యులతో కలిసి జోగిపేటలో ఉంటూ ట్రాలీ ఆటోలో వివిధ గ్రామా లు తిరుగుతూ రోజు సబ్బులు అమ్ముకుంటాడు.

కాగా శుక్రవారం చిట్కుల్ గ్రామానికి వచ్చాడు. దీంతో గ్రామానికి చెందిన చక్రాల అనితతో పలువురు మహిళలు ట్రాలీ ఆటో వద్ద సబ్బులు కొ నుగోలు చేశారు. అనిత వచ్చిన వెంటనే అమె  కొడుకు వెంకటేశ్ సైతం తల్లివెనకాల ఆటో వద్దకు వచ్చి ఆడుకుంటున్నాడు. సబ్బులు కొనడం పూర్తవడంతో మహిళలు వెళ్లిపోగా ఆటోడ్రైవర్ ఆటో ను ముందుకు తీశాడు. దీంతో ఆటో ముందు ఆడుకుంటున్న వెంకటేశ్‌ను డ్రైవర్ గమనించకపోవడంతో ఆటో ఢీ కొనడం తోపాటు అతనిపై ముందు టై రు ఎక్కడంతో తీవ్రగాయాలు అయ్యా యి.

గమనించిన గ్రామస్తులు బాధితుడిని బైక్‌పై చికిత్స నిమిత్తం జోగిపేట ఆసుపత్రికి తరలించారు. కాగా అప్పటికే వెంకటేశ్ మృతి చెందా డు. గ్రామానికి చెందిన చక్రాల అనిత, సత్యనారాయణలకు కూతురు శ్రీనిజ, కొడుకు వెంకటేశ్ ఉండగా అప్పటి వరకు తల్లి సంరక్షణలో సంతోషంగా గడిపిన కొడుకు వెంకటేశ్ క్షణంలో ఒక్కసారిగా మృతి చెందడంతో తల్లిదండ్రులు రోద న వర్ణనాతీతంగా మారింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement