breaking news
Trolley auto
-
అమ్మతో ఆడుకుంటూ..
ట్రాలీ ఆటో ఢీకొని బాలుడు మృతి కౌడిపల్లి: అప్పటిదాక తల్లి సంరక్షణలో అ డు కున్న పిల్లాడు అంతలోనే అనంతవాయువుల్లో కలిసిపోయాడు. ఆటో వద్ద సబ్బులు కొనేందుకు వెళ్లిన తల్లివెనకాల ఆటో వరకు వచ్చిన కొడుకు అదే ఆటో ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెం దాడు. ఈ ఘటన కౌడిపల్లి మండలం చిట్కుల్లో శుక్రవారం చోటుచేసుకుం ది. ఏఎస్ఐ ఖలిమొద్దీన్, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని చిట్కుల్లో ట్రాలీ ఆటో ఢీ కొనడం తో గ్రామానికి చెందిన చక్రాల అనిత, సత్యనారాయణ కొడుకు వెంకటేశ్ (2) అక్కడికక్కడే మృతి చెం దాడు. రంగారెడ్డి జిల్లా పరిగి గ్రామానికి చెందిన ఒంటెద్దు శ్రీనివాస్ గత కొన్నాళ్లుగా కుటుంబ సభ్యులతో కలిసి జోగిపేటలో ఉంటూ ట్రాలీ ఆటోలో వివిధ గ్రామా లు తిరుగుతూ రోజు సబ్బులు అమ్ముకుంటాడు. కాగా శుక్రవారం చిట్కుల్ గ్రామానికి వచ్చాడు. దీంతో గ్రామానికి చెందిన చక్రాల అనితతో పలువురు మహిళలు ట్రాలీ ఆటో వద్ద సబ్బులు కొ నుగోలు చేశారు. అనిత వచ్చిన వెంటనే అమె కొడుకు వెంకటేశ్ సైతం తల్లివెనకాల ఆటో వద్దకు వచ్చి ఆడుకుంటున్నాడు. సబ్బులు కొనడం పూర్తవడంతో మహిళలు వెళ్లిపోగా ఆటోడ్రైవర్ ఆటో ను ముందుకు తీశాడు. దీంతో ఆటో ముందు ఆడుకుంటున్న వెంకటేశ్‌ను డ్రైవర్ గమనించకపోవడంతో ఆటో ఢీ కొనడం తోపాటు అతనిపై ముందు టై రు ఎక్కడంతో తీవ్రగాయాలు అయ్యా యి. గమనించిన గ్రామస్తులు బాధితుడిని బైక్‌పై చికిత్స నిమిత్తం జోగిపేట ఆసుపత్రికి తరలించారు. కాగా అప్పటికే వెంకటేశ్ మృతి చెందా డు. గ్రామానికి చెందిన చక్రాల అనిత, సత్యనారాయణలకు కూతురు శ్రీనిజ, కొడుకు వెంకటేశ్ ఉండగా అప్పటి వరకు తల్లి సంరక్షణలో సంతోషంగా గడిపిన కొడుకు వెంకటేశ్ క్షణంలో ఒక్కసారిగా మృతి చెందడంతో తల్లిదండ్రులు రోద న వర్ణనాతీతంగా మారింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ తెలిపారు. -
ట్రాలీఆటో బోల్తాపడి విద్యార్థి దుర్మరణం
- మరో 23మందికి గాయూలు - ఇద్దరి పరిస్థితి విషమం - మామిడికాయలు తెంపేందుకు వెళ్తుండగా ప్రమాదం కొత్తకొండ(భీమదేవరపల్లి) : కూలీ పనుల నిమిత్తంమా మిడికాయలు తెంపేందుకు వెళ్తండగా అదుపుతప్పి ట్రాలీఆటో బోల్తాపడి గుగులోతు జీవన్(14) అనే విద్యార్థి దుర్మరణం చెందాడు. మరో 23మంది గాయపడ్డారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఒక బాలుడు సురక్షితంగా బయటపడ్డాడు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. మండలంలోని మల్లారం గ్రామపంచాయతీ పరిధి వీర్లగడ్డతండా కు చెందిన 25మంది గిరిజనులు కొత్తకొండకు చెందిన ట్రాలీఆటలో వరంగల్ జిల్లా హసన్‌పర్తిలో మామిడికాయలు తెంపేందుకు సోమవారం బయలు దేరారు. కొ త్తకొండ విద్యుత్ సబ్‌స్టేషన్ దాటగానే తారురోడ్డు ఏట వాలుగా ఉండడం, వాహనం వేగంగా వెళ్లడంతో అదపుతప్పి బొల్తాపడింది. ఈఘటనలో గుగులోతు జీవన్(14), గుగులోతు సరోజన, గుగులోతు జమున, గుగులోతు విజయ, గున్నీ, బుజ్జమ్మ, రాకేష్, గుమ్మ, బానో తు లక్ష్మి, స్వర్ణ, తిరుపతి, గణేష్, మంగమ్మ, సత్తమ్మ, శారద, కమల, ఉపేందర్, లక్ష్మి, గుగులోతు ధూళి, జ్యో తితోపాటు మరో నలుగురికి గాయూలయ్యూరుు. ఇంకో బాలుడు గుగులోతు రాజ్‌కుమార్ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డాడు. అరుుతే, తీవ్రంగా గాయపడిన గుగులోతు జీవన్, గుగులోతు సరోజన, గుగులోతు జమున, గుగులోతు రాకేశ్, గుగులోతు గున్నీని స్థానికులు 108అంబులెన్స్ ద్వారా వరంగల్ ఎంజీఎంకు తరలించారు. జీవన్ చికిత్స పొందుతూ మృతి చెం దాడు. గుగులోతు సరోజన, గుగులోతు జమున పరిస్థి తి విషమంగా ఉంది. మిగతా 19 మందిని ముల్కనూర్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స చేరుుస్తున్నారు. గాయపడిన వారి రోదనలతో ఆస్పత్రి దద్దరిల్లింది. ‘అమ్మమ్మ ఇంటికి పోతే బతికటోడు’ ‘అమ్మమ్మ ఇంటికి పోతనంటివి కదా కొడుకా.. ఆడికి పోయినా బతికటోడివి కదా బిడ్డా..’ అంటూ రోడ్డు ప్ర మాదంలో మృతి చెందిన గుగులోతు జీవన్ తల్లి రాధ రోదించిన తీరు పలువురిని కలిచివేసింది. గుగులోతు రాజేందర్-రాధ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు జీవన్ హుజూరాబాద్‌లోని వసతిగృహంలో ఎనిమిదో తరగతి చదువుచున్నాడు. వేసవి సెలవులు ప్రకటించడంతో స్వగ్రామం చేరాడు. సోమవారం అ మ్మమ్మ ఇంటికి వెళ్తానని చెప్పిన జీవన్.. కూలీకి పోతే రూ.150 వస్తుందనే ఆశతో మామిడికాయలు తెంపేం దుకు వెళ్లి మృత్యువాత పడ్డాడు. రెక్కాడితేగాని డొక్కాడని పేద గిరిజన కుటుంబాలు.. పొట్ట కూటి కోసం కూలీకి వెళ్తూ రోడ్డు ప్రమాదం బారినపడ్డారు. ఈ ఘట న వీర్లగడ్డతండాలో విషాదం నింపింది. కాగా, ఆటో డ్రైవర్ చింత సునీల్ పరారీలో ఉన్నాడని, కేసు నమోదు చేశామని ముల్కనూర్ ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు. పరిహారం చెల్లించాలని మృతదేహంతో ధర్నా తమ కుమారుడి మృతికి కారణమైన వారిపై చర్య తీపుకుని పరిహారం చెల్లించాలనే డిమాండ్‌తో జీవన్ కుటుంబ సభ్యులు జీవన్ మృతదేహంతో ముల్కనూర్‌లోని ప్రైవేటు ఆస్పత్రి సమీపంలో రెండుగంటలపాటు ధర్నా నిర్వహించారు. సమాచారం అందుకున్న సీఐ సదన్‌కుమార్, ఎస్సై వెంకటేశ్వర్లు సంఘటన స్థలానికి చేరుకొని ఆందోళనకారులను శాంతింపజేశారు.