పసికందును అమ్మిన తల్లిదండ్రులు | boy child sold in srikakulam district | Sakshi
Sakshi News home page

పసికందును అమ్మిన తల్లిదండ్రులు

Oct 2 2015 9:41 PM | Updated on Jul 12 2019 3:02 PM

శ్రీకాకుళం జిల్లాలో రూ.70 వేలకు ఓ మగ శిశువు విక్రయం జరిగింది.

ఎల్‌ఎన్ పేట: శ్రీకాకుళం జిల్లాలో రూ.70 వేలకు ఓ మగ శిశువు విక్రయం జరిగింది. ప్రాథమిక సమాచారం మేరకు.. ఎల్‌ఎన్ పేట మండలం బొరమాంబాపురం గ్రామానికి చెందిన కె.సింహాద్రి, లక్ష్మి దంపతులకు ముగ్గురు కుమార్తెలు. కుమారుడు కావాలన్న ఆశతో వారు శ్రీకాకుళం రూరల్ మండలం రాగోలు గ్రామానికి చెందిన దంపతులను ఆశ్రయించారు.

దీంతో వారు తమ రెండు నెలల మగ శిశువును సింహాద్రి, లక్ష్మి దంపతులకు రూ.70వేలకు విక్రయించేందుకు ముందుకు వచ్చారు. శుక్రవారం బొరమాంబాపురంలో పెద్దల సమక్షంలో ఇరువైపుల వారు పత్రాలు రాసుకున్న అనంతరం, శిశువును సింహాద్రి, లక్ష్మికి అప్పగించారు. దీనిపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు.
 

Advertisement
 
Advertisement
Advertisement