breaking news
ln peta
-
శ్రీకాకుళం జిల్లాలో అగ్ని ప్రమాదం
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఎల్ఎన్ పేటలోని ఓ వస్త్ర దుకాణంలో అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో మంటల్లో బట్టలు పూర్తిగా కాలిపోయాయి. ఫలితంగా రూ.10లక్షల ఆస్తి నష్టం చోటుచేసుకుంది. -
పసికందును అమ్మిన తల్లిదండ్రులు
ఎల్ఎన్ పేట: శ్రీకాకుళం జిల్లాలో రూ.70 వేలకు ఓ మగ శిశువు విక్రయం జరిగింది. ప్రాథమిక సమాచారం మేరకు.. ఎల్ఎన్ పేట మండలం బొరమాంబాపురం గ్రామానికి చెందిన కె.సింహాద్రి, లక్ష్మి దంపతులకు ముగ్గురు కుమార్తెలు. కుమారుడు కావాలన్న ఆశతో వారు శ్రీకాకుళం రూరల్ మండలం రాగోలు గ్రామానికి చెందిన దంపతులను ఆశ్రయించారు. దీంతో వారు తమ రెండు నెలల మగ శిశువును సింహాద్రి, లక్ష్మి దంపతులకు రూ.70వేలకు విక్రయించేందుకు ముందుకు వచ్చారు. శుక్రవారం బొరమాంబాపురంలో పెద్దల సమక్షంలో ఇరువైపుల వారు పత్రాలు రాసుకున్న అనంతరం, శిశువును సింహాద్రి, లక్ష్మికి అప్పగించారు. దీనిపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. -
నాణ్యత‘గాలి’ లో..!
పునరావాస కాలనీల్లో పనుల్లో నిబంధనలకు తిలోదకాలు పనుల్లో నాణ్యతా లోపం పది రోజులకే పెచ్చులూడుతున్న వైనం ఎల్.ఎన్.పేట, న్యూస్‌లైన్: వంశధార రిజర్వాయర్ నిర్వాసితుల కోసం నిర్మిస్తున్న పునరావాస కాలనీల పనుల్లో నాణ్యత లోపిస్తోంది. లక్షలాది రూపాయల నిధులు కాజేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పనుల్లో నాణ్యతకు తిలోదకాలిస్తూ..కాంట్రాక్టర్, సంబంధిత అధికారులు జేబులు నింపుకుంటున్నారని పలువుఉ విమర్శిస్తున్నారు. తాయిమాంబాపురం వద్ద హిరమండలం మండలం గార్లపాడు గ్రామానికి చెందిన వంశధార రిజర్వాయర్ నిర్వాసితుల కోసం పునరావాస కాలనీని ఏర్పాటు చేశారు. కాలనీకి రెండు వైపులా ఉన్న యంబరాం, బొత్తాడసింగి రోడ్లను సిమెంట్ రోడ్లుగా తీర్చిదిద్దేందుకు 62 లక్షలతో పనులు చేపట్టారు. రెండు ప్యాకేజీలుగా చేపట్టిన ఈ పనుల్లో ఒక ప్యాకేజీలో 28 లక్షలతో 550 మీటర్ల దూరం సీసీ రోడ్డు నిర్మించారు. అలాగే మరో ప్యాకేజీలో మరో ప్యాకేజీలో రూ.34లక్షలతో 600 మీటర్లమేర సీసీ రోడ్డుతోపాటు రక్షణగోడతో కూడిన రెండు కల్వర్టులు నిర్మించారు. సీసీ రోడ్డు ఏర్పాటు, కల్వర్టుల నిర్మాణంలోనూ నాణ్యతకు పాతరేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సరైన మెటల్ సైజు ఉపయోగించలేదని, మిక్సింగ్ మెటల్ ఇసుకను తలపిస్తోందని నిర్వాసితులు పేర్కొంటున్నారు. నిబంధనలకు తిలోదకాలి స్తూ..తమ బతుకులతో ఆడుకుంటున్నారని వా పోతున్నారు. కాంట్రాక్టర్లు, ఇంజినీర్లు కలిసి..నిధులు కాజేశారన్న ఆరోపణలు లేకపోలేదు. ప నుల్లో నాణ్యత లోపించకుండా చర్యలు చేపట్టాల్సిన ఇంజినీరింగ్ అధికారులు మామూళ్లకు కక్కుర్తిపడి చూసీచూడనట్లు వదిలేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్నతాధికారు లు స్పందించి నాణ్యత లోపించకుండా చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. బిల్లులు చెల్లించలేదు రోడ్డు నిర్మాణ పనులకు సంబంధించిన బిల్లులు చెల్లించలేదని పీఆర్ విభాగం ఏఈ కృష్ణమూర్తి ‘న్యూస్‌లైన్’కు చెప్పారు. క్వాలిటీ కంట్రోల్ పరిశీలనలు జరుగుతాయని, నాణ్యతలో లోపా లు బయటపడితే..చర్యలు తప్పవన్నారు. అధికారుల పర్యవేక్షణలో పనులు చేపట్టాలన్నారు.