ఆ ఒప్పందాల వెనుక భారీ కుంభకోణం: బొత్స | botsa satyanarayana takes on chandrababu govt | Sakshi
Sakshi News home page

ఆ ఒప్పందాల వెనుక భారీ కుంభకోణం: బొత్స

Jul 17 2016 11:37 AM | Updated on Jul 28 2018 4:24 PM

రాజధాని నిర్మాణానికి సింగపూర్ కంపెనీలతో ఒప్పందాల వెనుక భారీ కుంభకోణం ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బొత్స సత్యనారాయణ ఆరోపించారు.

ఏలూరు : రాజధాని నిర్మాణానికి సింగపూర్ కంపెనీలతో ఒప్పందాల వెనుక భారీ కుంభకోణం ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ఆదివారం పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. టీడీపీ పాలనలో లక్ష కోట్లపైగాఅవినీతి జరిగిందని పుస్తకాలు ప్రచురించి గతంలోనే ప్రధాని నరేంద్ర మోదీకి వివరించినట్లు చెప్పారు.

సింగపూర్ ఒప్పందాలపై సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐతో విచారణ జరిపించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని బొత్స డిమాండ్ చేశారు. స్విస్ చాలెంజ్ పద్దతిని సుప్రీంకోర్టు కూడా తప్పుపట్టిందని బొత్స సత్యనారాయణ గుర్తు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement