లారీని ఢీకొన్న బైక్, ఇద్దరు మృతి | Bike hits stationary heavy vehicle, two died | Sakshi
Sakshi News home page

లారీని ఢీకొన్న బైక్, ఇద్దరు మృతి

Dec 4 2016 9:24 AM | Updated on Aug 30 2018 4:07 PM

జిల్లాలోని సింగరాయకొండ జాతీయ రహదారిలో రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు.

ప్రకాశం: జిల్లాలోని సింగరాయకొండ జాతీయ రహదారిలో రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. జూగురుపల్లి మండలం బిట్రగుంట వద్ద ఆదివారం ఉదయం జరిగిన ఈ ఘటనలో రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ద్విచక్ర వాహనం ఢీ కొట్టింది. దీంతో ద్విచక్రవాహనంపై వెళుతున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు.
 
మృతులు ఒంగోలు మండలం మామిడిపాలెం గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. దట్టమైన పొగమంచు కారణంగా ఆగి ఉన్న లారీ కనిపించకపోవడంతో బైక్‌పై వెళుతున్న వారు ఢీ కొట్టి ఉంటారని స్థానికులు చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

Advertisement
 
Advertisement
Advertisement