కేటీఆర్తో ఏకే ఖాన్ భేటీ | acb chief ak khan meets ktr | Sakshi
Sakshi News home page

కేటీఆర్తో ఏకే ఖాన్ భేటీ

Sep 14 2015 10:19 AM | Updated on Aug 17 2018 12:56 PM

కేటీఆర్తో ఏకే ఖాన్ భేటీ - Sakshi

కేటీఆర్తో ఏకే ఖాన్ భేటీ

ఏసీబీ డీజీ ఏకే ఖాన్ సోమవారం ఉదయం మంత్రి కేటీఆర్తో సచివాలయంలో భేటీ అయ్యారు.

హైదరాబాద్ : ఏసీబీ డీజీ ఏకే ఖాన్ సోమవారం ఉదయం మంత్రి కేటీఆర్తో సచివాలయంలో భేటీ అయ్యారు.  తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామజ్యోతి పథకంలో భాగంగా ఆయన ఓ గ్రామాన్ని దత్తత తీసుకునేందుకు ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో దత్తత గ్రామం విషయంపై ఏకే ఖాన్ ఈ సందర్భంగా కేటీఆర్తో చర్చించినట్లు సమాచారం. రంగారెడ్డి జిల్లా జూకల్ గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు, ఊరిలోని సమస్యలను పరిష్కరిస్తామని ఆయన రెండు రోజుల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement