భార్య కాపురానికి రాలేదని భర్త ఆత్మహత్య | A man committed suicide in Medak | Sakshi
Sakshi News home page

భార్య కాపురానికి రాలేదని భర్త ఆత్మహత్య

Aug 21 2016 7:11 PM | Updated on Nov 6 2018 8:04 PM

భార్య కాపురానికి రాలేదని భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన కొండపాక మండలం లక్డారంలో ఆదివారం చోటుచేసుకుంది.

భార్య కాపురానికి రాలేదని భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన కొండపాక మండలం లక్డారంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చాకలె మల్లయ్య(55)కు సుమారు 33 సంవత్సరాల క్రితం నంగనూరుకు చెందిన ఓ యువతితో పెళ్లయింది. వీరి సంసారం పదేళ్లు సజావుగానే సాగింది. అనంతరం చిన్న గొడవ పడి భార్య పిల్లలతో సహా పుట్టింటికి వెళ్లిపోయింది. ఎన్నిసార్లు చెప్పినా కాపురానికి రాలేదనే మనస్తాపంతో మల్లయ్య ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement