'లైవ్ విత్ వైఎస్ షర్మిల ఫ్రం లాస్ ఏంజెల్స్' | Observe counting day with ys Sharmila in Los Angeles | Sakshi
Sakshi News home page

'లైవ్ విత్ వైఎస్ షర్మిల ఫ్రం లాస్ ఏంజెల్స్'

May 12 2014 3:38 PM | Updated on Apr 4 2019 3:25 PM

'లైవ్ విత్ వైఎస్ షర్మిల ఫ్రం లాస్ ఏంజెల్స్' - Sakshi

'లైవ్ విత్ వైఎస్ షర్మిల ఫ్రం లాస్ ఏంజెల్స్'

సార్వత్రిక ఎన్నికల లెక్కింపు రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వైఎస్ షర్మిల అమెరికా నుంచి 'సాక్షి' టీవీ లైవ్లో పాల్గొననున్నారు

హైదరాబాద్ : సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వైఎస్ షర్మిల లాస్ ఏంజెల్స్ నుంచి 'సాక్షి' టీవీ లైవ్లో పాల్గొననున్నారు. (అమెరికా కాలమాన ప్రకారం) మే 15వ తేదీ సాయంత్రం ఏడు గంటల నుంచి  ఆమె షెరటాన్ కెరిటోస్ హోటల్, 12725 సెంటర్ కోర్టు డ్రైవ్, కెరిటోస్, కాలిఫోర్నియా నుంచి  లైవ్లో పాల్గొంటారు.

వైఎస్‌ఆర్ కాంగ్రెస్ - యూఎస్ ఎన్‌ఆర్‌ఐ కమిటీ ఆధ్వర్యంలో వైఎస్ షర్మిల లైవ్ కార్యక్రమం నిర్వహించనున్నారు. మే 16న ఎన్నికల లెక్కింపు జరగనున్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి వస్తుందంటూ వైఎస్ షర్మిల 150కి పైగా అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.

జగనన్న వదిలిన బాణం అంటూ వైఎస్ షర్మిల...వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున సుదీర్ఘ పాదయాత్ర చేసిన విషయం తెలిసిందే. ఆమె 'మరో ప్రజాప్రస్థానం' పాదయాత్ర పేరిట 3112 కిలోమీటర్ల దూరాన్ని 230 రోజుల పాటు చేపట్టి చరిత్ర పుటల్లోక్కి ఎక్కారు.  2012 అక్టోబర్ 18న  వైఎస్ఆర్  జిల్లా ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన  శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వద్ద ముగించారు. రాష్ట్రంలో 14 జిల్లాలు, 116 అసెంబ్లీ నియోజక వర్గాలు, తొమ్మిది కార్పొరేషన్లు, 45 మున్సిపాల్టీలు, 195 మండలాల్లో షర్మిల పర్యటించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement