ఢిల్లీలో భూ ప్రకంపనలు | Tremors With 4.0 Magnitude Felt In Delhi | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో భూ ప్రకంపనలు

Jul 1 2018 4:36 PM | Updated on Jul 1 2018 4:36 PM

Tremors With 4.0 Magnitude Felt In Delhi - Sakshi

న్యూఢిల్లీ : దేశ రాజధానిలో ఆదివారం భూ ప్రకంపనలు అలజడి రేకెత్తించాయి. మధ్యాహ్నం 3.37 గంటల ప్రాంతంలో భూమి పలుమార్లు కంపించింది. రిక్టర్ స్కేల్‌పై భూ కంప తీవ్రత 4.0గా నమోదైంది. హర్యానాలోని సోనిపట్‌ వద్ద భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు.

ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లో కూడా కొద్దిసేపు భూమి కంపించింది. భూ ప్రకంపనలతో ఉలిక్కిపడ్డ రాజధాని ప్రాంత వాసులు ట్వీట్ల వర్షం కురిపించారు. భూ కంపం కారణంగా ఎలాంటి నష్టం జరగలేదు.

Advertisement
 
Advertisement
Advertisement