పది రోజుల్లో పెళ్లి.. అంతలోనే | Young Woman Commits Suicide | Sakshi
Sakshi News home page

పది రోజుల్లో పెళ్లి.. అంతలోనే

Apr 10 2018 11:11 AM | Updated on Nov 6 2018 8:16 PM

Young Woman Commits Suicide - Sakshi

శిరీష(ఫైల్‌)

కథలాపూర్‌(వేములవాడ):  ఐదు రోజుల క్రితం నిశ్చితార్థం.. పదిరోజుల్లో పెళ్లి.. అంతలోనే యు వతి ఆత్మహత్యకు ఒడిగట్టింది. ఈ ఘటన తక్కళ్లపెల్లిలో విషాదం నింపింది. పోచంపెల్లి సాయ మ్మ–గంగరాజం దంపతులకు ఇద్దరు కుమారు లు, కూతురు శిరీష(21) సంతానం. యువతికి మేడిపెల్లి మండలం దేశాయిపేటకు చెందిన వ్యక్తితో ఈనెల 4న నిశ్చితా ర్థం జరిగింది.

ఈనెల 19న పెళ్లి ముహూర్తంగా నిర్ణయించుకున్నారు. ఆభరణాల విషయంలో పెళ్లికొడుకు అత్తింటి వారికి ఫోన్‌ చే శారు. అరతులం బంగారుపుస్తెలు తాడు చేయించాలని అనడంతో  మనస్పర్థలు వచ్చాయి. ఇప్పుడే ఇలా ఉంటే పెళ్లి తర్వాత ఎంత ఒత్తిడి ఉంటుందో నని ఆందోళన చెందిన శిరీష సోమవారం ఇంట్లోనే ఉరి వేసుకుందని కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతురాలి తల్లి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నాగేశ్వర్‌రావు తెలిపారు.    

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement