ప్రేమించాలంటూ యువతిపై దాడి   | A Young Man Attacked a Young Woman for Love Nandyal | Sakshi
Sakshi News home page

ప్రేమించాలంటూ యువతిపై దాడి  

Jun 22 2019 7:14 AM | Updated on Jun 22 2019 7:15 AM

A Young Man Attacked a Young Woman for Love Nandyal - Sakshi

సాక్షి, నంద్యాల : తనను ప్రేమించాలంటూ ఓ యువతిపై యువకుడు దాడి చేశాడు. ఈ ఘటన నూనెపల్లెలో శుక్రవారంవారం చోటుచేసుకుంది. త్రీటౌన్‌ సీఐ సుదర్శన్‌ ప్రసాద్‌ తెలిపిన మేరకు వివివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని నూనెపల్లెకు చెందిన ప్రభు అనే యువకుడు ఓ యువతిని ప్రేమించాలంటూ వేధిస్తున్నాడు. యువతి ఒప్పుకోకపోవడంతో ఆమెను బలత్కారం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఒంటరిగా రైల్వే ట్రాక్‌ పక్కన బహిర్భూమికి వెళ్లిన యువతిని కత్తితో బెదిరించాడు. అత్యాచార యత్నానికి పాల్పడగా  యువతి ప్రతిఘటించింది. దీంతో ఆ యువకుడు దాడి చేయడంతో ఆమె స్పృహ కోల్పోయింది. ముళ్లపొదల మధ్య పడి ఉన్న యువతిని స్థానికులు గమనించి నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితురాలి బంధువుల ఫిర్యాదు మేరకు అత్యాచారయత్నానికి పాల్పడిన ప్రభు అనే యువకుడిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.    

Advertisement
 
Advertisement
Advertisement