మరో రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి | Woman Died In Road Accident In Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో మరో రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి

Nov 27 2019 4:55 PM | Updated on Nov 27 2019 8:55 PM

Woman Died In Road Accident In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నగరంలో వరసగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. మంగళవారం బంజారాహిల్స్‌లో ఆర్టీసీ బస్సుకింద పడి మహిళా సాఫ్ట్‌వేర్‌ మృతి చెందిన ఘటన మరవక ముందే ఏఎస్‌రావు నగర్‌ చౌరస్తాలో మరో ఘోరం జరిగింది. అతివేగంగా వెళ్తున్న ట్రక్కు.. స్కూటీపై వెళ్తున్న మహిళను ఢీకొట్టింది. తలపై నుంచి ట్రక్కు టైరు వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. హెల్మెట్‌తో పాటు ఆ మహిళ తల ఛిద్రమైంది. ఏఎస్‌రావు నగర్‌లోని రాధిక థియేటర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ట్రక్కు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది. 



Advertisement
 
Advertisement
Advertisement