కరెంటు తీగలు తగిలి ఇద్దరి మృతి | Two died with current shock | Sakshi
Sakshi News home page

కరెంటు తీగలు తగిలి ఇద్దరి మృతి

Apr 3 2018 8:58 AM | Updated on Aug 25 2018 6:06 PM

Two died with current shock - Sakshi

సంఘటనాస్థలంలో మృతదేహాలు( అంతర్‌ చిత్రంలో పాత చిత్రాలు)

అనంతపురం జిల్లా : విద్యుత్ తీగలు తగిలి మంగళవారం ఇద్దరు వ్యక్తులు మరణించారు. పుట్లూరు మండలం అరకటివేములలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంటి వద్ద గాలివాన తో పేరుకుపోయిన చెత్తను తొలగిస్తుండగా అప్పటికే తెగిపడ్డ విద్యుత్ తీగలు తగిలి ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు అప్రమత్తమై రక్షించేలోపే ఈ ప్రమాదం జరిగింది. ఇద్దరి శరీరాలు కరెంటు ప్రసరణ ధాటికి పూర్తిగా కాలిపోయాయి. ఈ ఘటనతో మృతుల కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అలాగే జిల్లా వ్యాప్తంగా పిడుగు పాటుకు నల్లమాడ మండలంలో ఇద్దరు, చిలమత్తూరు మండలంలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. అకాలవర్షాలకు తాడిపత్రి, పుట్టపర్తి, శింగనమల నియోజకవర్గాల్లో పండ్లతోటలు దెబ్బతిన్నాయి. అక్కడక్కడా విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి.

Advertisement
 
Advertisement
Advertisement