నగరంలో విషాదం: ఫిల్లర్‌ గుంతలో పడి.. | Three Year Old Boy Lost Breath In Hyderabad | Sakshi
Sakshi News home page

నగరంలో విషాదం: ఫిల్లర్‌ గుంతలో పడి..

Jun 11 2020 8:49 PM | Updated on Jun 11 2020 8:59 PM

Three Year Old Boy Lost Breath In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మీర్‌పేట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. ఓ నిర్మాణం కోసం తీసిన పిల్లర్‌ గుంతలో పడి మూడేళ్ల బాలుడు మృత్యువాతపడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నందీహిల్స్ కాలనీ రోడ్ నెం.19లో ఉన్న 20 ఫీట్ రోడ్డు పక్కన కన్‌స్ట్రక్షన్ కోసం ఫిల్లర్‌ గుంత తవ్వారు. నిన్న కురిసిన వర్షానికి ఆ గుంత నీటితో నిండిపోయింది. ఆడుకోవడానికి వెళ్లి ప్రమాదవశాత్తు ఆ గుంతలో పడి ఆ బాలుడు మరణించాడు. 

విషయం తెలుసుకున్న పోలీసులు,  డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాబు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న మీర్‌పేట్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాలుడి హ‌ఠాన్మ‌ర‌ణంతో అత‌ని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. బాధిత కుటుంబం నల్గొండ జిల్లా నాంపల్లి మండలం పసునూర్‌ గ్రామానికి చెందినవారుగా తెలిసింది. 

Advertisement
 
Advertisement
Advertisement