ఘోర ప్రమాదం: ముగ్గురు పోలీసుల మృతి | Three Police Officers Killed In Road Accident At Bengaluru | Sakshi
Sakshi News home page

ఘోర ప్రమాదం: ముగ్గురు పోలీసుల మృతి

May 10 2018 12:36 PM | Updated on Aug 30 2018 4:20 PM

Three Police Officers Killed In Road Accident At Bengaluru - Sakshi

సాక్షి, బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలోని బాల్‌కోట్‌ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎన్నికల విధుల కోసం బెంగళూరు నుంచి వెళుతున్న పోలీసుల వాహనాన్ని వెనుక నుంచి వచ్చిన ట్రక్కు ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో వాహనంలో ఉన్న ముగ్గురు పోలీసులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు.

క్షతగాత్రులను ప్రాథమిక చికిత్స అనంతరం బెంగళూరు ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతి చెందిన వారిని సీఐడీ విభాగం డీఎస్పీ, సీఐ, వాహనం డ్రైవర్‌గా గుర్తించారు. సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement