ఈఎస్‌ఐ కుంభకోణంలో మరో ముగ్గురు అరెస్ట్‌ | Three More Arrested In ESI Scam | Sakshi
Sakshi News home page

ఈఎస్‌ఐ కుంభకోణంలో మరో ముగ్గురు అరెస్ట్‌

Oct 11 2019 6:34 PM | Updated on Oct 11 2019 6:47 PM

Three More Arrested In ESI Scam - Sakshi

సాక్షి,  హైదరాబాద్‌: ఈఎస్‌ఐ కుంభకోణంలో మరో ముగ్గురిని  అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) శుక్రవారం అరెస్ట్‌ చేసింది. తేజ ఫార్మా ఎండి రాజేశ్వర్‌రెడ్డి, చర్లపల్లి డిస్పెన‍్సరీ ఫార్మాసిస్ట్‌ లావణ్య, వరంగల్‌ జేడీ కార్యాలయంలో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి పాషాలను ఏసీబీ అధికారులు అరెస్ట్‌ చేశారు. రూ. 28 కోట్ల మందుల కొనుగోళ్ల వ్యవహారంలో రాజేశ్వర్‌రెడ్డి అవకతవకలకు పాల్పడినట్లు ఏబీసీ గుర్తించింది. గతంలో అరెస్టయిన వెంకటేశ్వర హెల్త్‌ కేర్‌ ఎండీ అరవింద్‌రెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు ముగ్గురు నిందితులను ఏసీబీ అధికారులు అరెస్ట్‌ చేశారు. ఈ అరెస్ట్‌లతో ఇప్పటి వరకూ ఈఎస్‌ఐ కుంభకోణంలో అరెస్టయిన వారి సంఖ్య 16కి చేరింది. ఏసీబీ సోదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement