భారీగా బంగారం పట్టివేత | Three Crore Rupees Gold Seized At Shamshabad Airport | Sakshi
Sakshi News home page

భారీగా బంగారం పట్టివేత

May 7 2019 10:47 AM | Updated on May 7 2019 12:15 PM

Three Crore Rupees Gold Seized At Shamshabad Airport - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌ : శంషాబాద్‌ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుపడింది. దాదాపు రూ.3 కోట్ల విలువైన బంగారాన్నిపోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌ నుంచి దుబాయ్‌ వెళుతున్న థామస్‌ అనే ప్రయాణికుడి నుంచి ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. లెక్కలు చూపకుండా అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని గుర్తించిన సీఐఎస్‌ఎఫ్‌ అధికారులు ధామస్‌ను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. థామస్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు మరిన్ని వివరాల కోసం విచారణ జరుపుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement