మందుబాబుల వీరంగం... పోలీసుల పై దాడి | Police Attacked By Alchohol Consumption People In Warangal | Sakshi
Sakshi News home page

పోలీసులపై తిరగబడిన మందుబాబులు

Feb 16 2020 9:16 AM | Updated on Feb 16 2020 9:52 AM

Police Attacked By Alchohol Consumption People In Warangal - Sakshi

సాక్షి, కాజీపేట అర్బన్‌: మద్యం మత్తులో పోలీసులపై మందు బాబులు తిరగబడి, దాడికి పాల్పడిన సంఘటన శనివారం ఉర్సు గుట్ట ప్రాంతంలో చోటు చేసుకుంది. మిల్స్‌కాలనీ ఎస్సై భీమేష్‌ కథనం ప్రకారం.. కరీమాబాద్‌కు చెందిన ఇద్దరు యువకులు ఉర్సుగుట్ట ప్రాంతంలో బహిరంగంగా మద్యం సేవిస్తుండగా విధులు నిర్వహిస్తున్న బ్లూకోడ్స్‌ సిబ్బంది మద్యం సేవిస్తున్న యువకులను బహిరంగ మద్యం సేవించకూడదని వారించారు. దీంతో మద్యం మత్తులో ఉన్న యువకులు వారిపై దాడికి పాల్పడ్డారు.

కాగా, ఘటన స్థలానికి ఇంటర్‌సెప్టర్‌ వాహనంలో పోలీసులు చేరుకుని యువకులను అదుపులోకి తీసుకుని మిల్స్‌కాలనీ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. యువకులపై బహిరంగ మద్యం సేవిస్తున్న కేసు, విధుల్లో ఉన్న పోలీసుల అధికారుల విధులకు బంగం కలిగించిన కేసు నమోదు చేసినట్లు తెలిపారు.  

Advertisement
 
Advertisement
Advertisement