అదృశ్యమై.. అస్థిపంజరంగా. | Old Lady Missed And Died | Sakshi
Sakshi News home page

అదృశ్యమై.. అస్థిపంజరంగా.

Apr 24 2018 2:02 PM | Updated on Sep 28 2018 3:39 PM

Old Lady Missed And Died  - Sakshi

విచారణ చేపడుతున్న పోలీసులు

కొమురవెల్లి(సిద్దిపేట): మూడు నెలల క్రితం గురువన్నపేటలో అదృశ్యమైన వృద్ధురాలి అస్థిపంజరం లభ్యమైన ఘటన సోమవారం రాత్రి వెలుగులోకి వచ్చింది. గురువన్నపేటకు చెందిన బండారు గౌరవ్వ(75) జనవరి 22న అదృశ్యమైన సంగతి మనకు తెలిసిందే.

కాగా, జనవరి 24న కుటుంబ సభ్యులు కొమురవెల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సోమవారం గురువన్నపేట వాగులో ఓ గొర్రెల కాపరికి మనిషి పుర్రె కనిపించింది. దీంతో ఈ విషయాన్ని ఇరుగుపొరుగుకు తెలియజేయడంతో పాటు పోలీసులకు సమాచారం అందించారు.

చేర్యాల సీఐ రఘు, కొమురవెల్లి ఎస్‌ఐ సతీశ్‌కుమార్‌తో పాటు గౌరవ్వ కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కాగా, చీర, కొన్ని వస్తువుల ఆధారంగా అస్థిపంజరం గౌరవ్వదిగా ఆమె కుటుంబ సభ్యులు గుర్తించారు. వృద్ధురాలికి ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement