ఎంఎంటీఎస్‌ రైలు ఢీకొని నర్సు మృతి | Nurse Died in Metro Train Accident Hyderabad | Sakshi
Sakshi News home page

ఎంఎంటీఎస్‌ రైలు ఢీకొని నర్సు మృతి

Mar 8 2019 9:29 AM | Updated on Mar 8 2019 9:29 AM

Nurse Died in Metro Train Accident Hyderabad - Sakshi

నర్సు రేఖా మహల్‌ మృతదేహం

ఖైరతాబాద్‌: ఎంఎంటీఎస్‌ రైలు ఢీ కొని ఓ నర్సు మృతిచెందింది. ఈ సంఘటన ఖైరతాబాద్‌లో జరిగింది. నాంపల్లి జిఆర్‌పిఎఫ్‌ ఇన్‌వెస్టిగేషన ఆఫీసర్‌ మహ్మద్‌ బషీరుద్దీన్‌ తెలిపిన మేరకు.. ఢిల్లీకి చెందిన రేఖా మహల్‌(25) లక్డీకాపూల్‌లోని గ్లోబల్‌ హాస్పిటల్‌లో పనిచేస్తూ టెలిఫోన్‌ భవన్‌ ఎదురుగా ఉన్న హాస్టల్‌లో ఉంటుంది. గురువారం ఉదయం జిమ్‌ చేసి తిరిగి ఉదయం 8.08 గంటలకు ఖైరతాబాద్‌ రైల్వేగేట్‌ వద్ద గేటు వేసి ఉన్న సమయంలో చెవిలో హెడ్‌ఫోన్స్‌ పెట్టుకొని పట్టాలు దాటేందుకు ప్రయత్నించడంతో నాంపల్లి నుంచి లింగంపల్లి వైపు వెళ్తున్న ఎంఎంటీఎస్‌ రైలును  రైలు ఢీ కొట్టింది. ఈ సంఘటనలో  ఆమె తలకు తీవ్రగాలయ్యాయి. వెంటనే హాస్పిటల్‌కు తరలించినా అప్పటికే మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు.  

Advertisement
 
Advertisement
Advertisement