రైలు కిందపడి నీట్‌ విద్యార్థి మృతి | NEET Student Suicide In Nalgonda | Sakshi
Sakshi News home page

రైలు కిందపడి నీట్‌ విద్యార్థి మృతి

Apr 30 2018 11:28 AM | Updated on Nov 9 2018 5:02 PM

NEET Student Suicide In Nalgonda - Sakshi

అనిల్‌ (ఫైల్‌)

కొండమల్లేపల్లి : కొండమల్లేపల్లి మండల పరిధిలోని చెన్నారం గ్రామపంచాయతీ ఏపూర్‌తండాకు చెందిన ఎంపీటీసీ రమావత్‌ లలిత, లాలునాయక్‌ దంపతుల రెండో కుమారుడు అనిల్‌(21) ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని ఈనెల 28న రైలుకింద పడి మృతి చెందాడు. అనిల్‌ అక్కడి నీట్‌ కళాశాలలో ఈసీఈ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు.  అక్కడి రైల్వే పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు బంధువులు మృతదేహాన్ని ఆదివారం తండాకు తీసుకొచ్చారు. అనిల్‌ మృతి విషయం తెలియడంతో తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగం చేస్తాడని కలలు కన్న తల్లిదండ్రులు కుమారుడి మృతితో బోరున విలపించారు. అనిల్‌ మృతికి ప్రేమ వ్యవహారమే కారణమై ఉంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement