రోడ్డు ప్రమాదంలో వివాహిత మృతి | Married Woman Died In Road Accident Guntur | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో వివాహిత మృతి

May 6 2018 5:54 AM | Updated on Aug 30 2018 4:20 PM

Married Woman Died In Road Accident Guntur - Sakshi

షేక్‌ పర్వీన్‌ (ఫైల్‌)

గుంటూరు, యడ్లపాడు: నాదెండ్ల మండలంలోని చందవరం గ్రామంలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో వివాహిత మృతి చెందింది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని చిరుమామిళ్ల గ్రామానికి చెందిన ఆర్‌ఎంపీ వైద్యుడు షేక్‌ అమీర్‌కు యడ్లపాడు గ్రామానికి చెందిన పి.మాబుసుభాని, దిల్‌షాద్‌బేగం దంపతులు కుమార్తె పర్వీన్‌ (22)తో వివాహమైంది. గతేడాది కాలంలో వీరు వైద్యవృత్తి కోసం చందవరం గ్రామంలోనే నివాసం ఉంటున్నారు. భార్య పర్వీన్‌పుట్టింటికి వెళ్లాలనడంతో దంపతులిద్దరు శుక్రవారం యడ్లపాడుకు వచ్చారు.

శనివారం ఉదయం తిరిగి చందవరం వెళ్తుండగా సాతులూరు నుంచి తూబాడు వైపు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం ఎదురుగా వచ్చి ఢీకొంది. దీంతో బైక్‌పై నుంచి కింద పడిపోవడంతో తలకు తీవ్ర గాయాలవ్వడంతో కోమాలోకి వెళ్లింది. స్థానికులు గమనించి వారిని నరసరావుపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ పర్వీన్‌ మృతి చెందింది. దీంతో రెండు గ్రామాల్లోనూ విషాదచాయలు అలుముకున్నాయి. 

Advertisement
 
Advertisement
Advertisement