‘తూర్పు’లో మూగజీవిపై లైంగికదాడి! | Man Molestation on Cow in East Godavari | Sakshi
Sakshi News home page

‘తూర్పు’లో మూగజీవిపై లైంగికదాడి!

Dec 24 2018 8:49 AM | Updated on Dec 24 2018 5:23 PM

Man Molestation on Cow in East Godavari - Sakshi

కదలేని స్థితిలో ఉన్న ఆవును పైకి లేపేందుకు ప్రయత్నిస్తున్న రైతులు

తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం మండలం గోకివాడలో గుర్తు తెలియని దుండగులు ఆవుపై లైంగిక దాడికి పాల్పడ్డారు.

పిఠాపురం రూరల్‌: తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం మండలం గోకివాడలో గుర్తు తెలియని దుండగులు ఆవుపై లైంగిక దాడికి పాల్పడ్డారు. బాధిత రైతు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. గోకివాడ– బి.కొత్తూరు ప్రధాన రహదారి పక్కన గోకివాడకు చెందిన నామా బుచ్చిరాజుకు పశువుల మకాం ఉంది. శనివారం రాత్రి దుండగులు మకాంలో ఉన్న 3 నెలల చూడి ఆవును సమీపంలోని తాడిచెట్టుకు బంధించి లైంగిక దాడికి పాల్పడ్డారు. తెల్లవారుజామున రైతు బుచ్చిరాజు సమీపంలోని ఓ తాడిచెట్టు వద్ద కదల్లేని స్థితిలో పడి ఉన్న తన ఆవును గుర్తించాడు.

తోటి రైతుల సాయంతో ఆవును బంధించిన తాళ్లను తొలగించాడు. ఆవు కదల్లేని స్థితిలో ఉండటం, దాని జననేంద్రియంపై రక్తపు గాయాలు కనిపించడంతో లైంగిక దాడి జరిగిందని రైతులు గుర్తించారు. దీంతో బుచ్చిరాజు కుమారుడు లక్ష్మీనారాయణ పిఠాపురం రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పశువైద్య సిబ్బంది ఆవుకు వైద్య సేవలందిస్తున్నారు. సంఘటన స్థలంలో ఒక ఖాళీ మద్యం సీసా దొరికింది. దీన్ని బట్టి దుండగులు తాగిన మైకంలో ఈ అకృత్యానికి ఒడిగట్టి ఉంటారని అనుమానిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement