బస్సులో సీటు లేదన్నందుకు.. | Man Attack on Bus in YSR Kadapa | Sakshi
Sakshi News home page

బస్సులో సీటు లేదన్నందుకు..

Jan 17 2019 1:59 PM | Updated on Jan 17 2019 1:59 PM

Man Attack on Bus in YSR Kadapa - Sakshi

బస్సు అద్దాలు పగలకొట్టిన దృశ్యం

వైఎస్‌ఆర్‌ జిల్లా , ఎర్రగుంట్ల:  ఎర్రగుంట్ల పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో బస్సు అద్దాలు పగలకొట్టి హల్‌చల్‌ చేసిన శివశంకర్‌ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బస్సు కండక్టర్‌ గంగమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు. మంగళవారం ఎర్రగుంట్ల ఆర్టీసీ బస్టాండ్‌కు ప్రొద్దుటూరు నుంచి వేంపల్లికు వెళ్లే బస్సు వచ్చి ఆగింది. ఆ బస్సులో ప్రయాణికులు ఫుల్‌గా ఉండటంతో కూర్చోడానికి స్థలం కూడా లేదు. అయితే అదే సమయంలో అయ్యవారిపల్లెకు వెళ్లేందుకు శివశంకర్‌ అనే వ్యక్తి బస్సు ఎక్కబోయాడు. స్థలం లేదని కండక్టర్‌ గంగమ్మ చెప్పారు. దీంతో శివశంకర్‌ కోపంగా బస్సు అద్దాలపై రాయితో బలంగా కొట్టాడు. అంతే అద్దాలు పగలిపోయి ముక్కలు బస్సులో ఉన్న ప్రయాణికుడు నారాయణరెడ్డి  తలకు తగిలి రక్తగాయాలయ్యాయి. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి శివశంకర్‌ను అదుపులోకి తీసుకుని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. కండక్టర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్‌ఐ  తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement