పెద్దలు అంగీకరించలేదని.. | Lovers commit to suicide | Sakshi
Sakshi News home page

ప్రేమ జంట ఆత్మహత్య

Dec 24 2017 10:19 AM | Updated on Dec 24 2017 10:22 AM

Lovers commit to suicide  - Sakshi

వేలూరు: ప్రేమ పెళ్లికి పెద్దలు అంగీకరించలేదని ఓ ప్రేమ జంట ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన గుడియాత్తం సమీపంలో శనివారం జరిగింది. వేలూరు జిల్లా గుడియాత్తం తాలుకా కనవాయిమోటూరుకు చెందిన వెంకటేషన్‌ కుమారుడు రామలింగం(25) వ్యవసాయం చేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన పిచ్చాండి కుమార్తె తిలగ(18) రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమను పెద్దలు వ్యతిరేకించారు.

ఈ నేపథ్యంలో శనివారం ఉదయం ఇద్దరూ ఇంట్లో కనిపించక పోవడంతో కుటుంబ సభ్యులు గాలించారు. గ్రామం సమీపంలోని ఓ చెట్టుకు ఇద్దరూ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. గమనించిన స్థానికులు తల్లిదండ్రులకు తెలిపారు. కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని కన్నీరు మున్నీరయ్యారు. సమాచారంతో గ్రామ పరిపాలన అధికారి శంకర్‌ ఫిర్యాదు మేరకు పరదరామి పోలీసులు కేసు నమోదు చేసి మృత దేహాలను ఆస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement