లా విద్యార్థిని ఆత్మహత్య | Law Student Susmitha Commits Suicide in Chittoor | Sakshi
Sakshi News home page

లా విద్యార్థిని ఆత్మహత్య

Dec 14 2018 12:11 PM | Updated on Dec 14 2018 12:11 PM

Law Student Susmitha Commits Suicide in Chittoor - Sakshi

సుస్మిత మృతదేహం

తిరుపతి క్రైం : శ్రీపద్మావతి మహిళా యూనివర్సిటీలో లా ఆఖరి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని నగరంలోని ప్రైవేట్‌ హాస్టల్లో ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. ఎస్వీ యూనివర్సిటీ సీఐ చంద్రశేఖర్‌ వివరాల మేరకు.. కడప జిల్లా శేషయ్యగారిపల్లెకు చెందిన శ్రీనివాసులు, రాజేశ్వరి కుమార్తె బి.సుస్మిత(24) పద్మావతి మహిళా యూనివర్సిటీలో లా ఆఖరి సం వత్సరం చదువుతోంది. మూడేళ్లుగా యూని వర్సిటీ సమీపంలోని ఎస్‌కే వర్కింగ్‌ ఉమెన్స్‌ హాస్టల్లో ఓ గదిని అద్దెకు తీసుకుని ఉంటోంది. గురువారం సాయంత్రం ఆమెతో పాటుగదిలో ఉంటున్న యువతులు వచ్చి తలుపు తెరిచేందుకు ప్రయత్నించగా, గడియ పెట్టి ఉంది.

అనుమానం వచ్చి కిటికీలో నుంచి చూడగా సుస్మిత ఫ్యాన్‌కు ఉరి వేసుకుని వేలాడుతూ కన్పించింది. తెలుసుకున్న హాస్టల్‌ యాజమాన్యం ఎస్వీయూ పోలీసులకు తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతురాలి గదిని పరిశీలించి, ఆమె తండ్రికి సమాచారం అందించారు. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.  కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టమ్‌ నిమిత్తం ఎస్వీ మెడికల్‌ కళాశాలకు తరలించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement