ప్రెషర్‌ బాంబు పేలి జవానుకు తీవ్ర గాయాలు | Jawan injured in blast in Chhattisgarh's Bijapur district | Sakshi
Sakshi News home page

ప్రెషర్‌ బాంబు పేలి జవానుకు తీవ్ర గాయాలు

Sep 27 2018 6:10 AM | Updated on Oct 9 2018 2:53 PM

Jawan injured in blast in Chhattisgarh's Bijapur district - Sakshi

పర్ణశాల: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజాపూర్‌ జిల్లాలో మావోయిస్టులు అమర్చిన ప్రెషర్‌ బాంబు (ఐఈడీ) పేలి డీఆర్జీ జవానుకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన బుధవారం జరిగింది. ఎస్పీ మోహిత్‌ గార్గ్‌ కథనం ప్రకారం.. జిల్లాలోని కొత్వాలి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని అడవుల్లో డీఆర్జీ బలగాలు కూంబింగ్‌ ముగించుకొని బేస్‌ క్యాంపునకు తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో పరెడా గ్రామ సమీపంలో డీఆర్జీ జవాను కమ్లూ హేమ్లా మావోయిస్టులు అమర్చిన ప్రెషర్‌ బాంబుపై కాలు వేయడంతో భారీ పేలుడు సంభవించింది. దీంతో తీవ్ర గాయాలైన హేమ్లా ను ముందుగా బేస్‌ క్యాంపునకు తరలించి ప్రథమ చికిత్స అందించి, అనంతరం బీజాపుర్‌ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం జవాను పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఎస్పీ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement