breaking news
pressure bomb blast
-
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లలో పేలిన ప్రెజర్ బాంబు
-
ప్రెషర్ బాంబు పేలి జవానుకు తీవ్ర గాయాలు
పర్ణశాల: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు అమర్చిన ప్రెషర్ బాంబు (ఐఈడీ) పేలి డీఆర్జీ జవానుకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన బుధవారం జరిగింది. ఎస్పీ మోహిత్ గార్గ్ కథనం ప్రకారం.. జిల్లాలోని కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని అడవుల్లో డీఆర్జీ బలగాలు కూంబింగ్ ముగించుకొని బేస్ క్యాంపునకు తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో పరెడా గ్రామ సమీపంలో డీఆర్జీ జవాను కమ్లూ హేమ్లా మావోయిస్టులు అమర్చిన ప్రెషర్ బాంబుపై కాలు వేయడంతో భారీ పేలుడు సంభవించింది. దీంతో తీవ్ర గాయాలైన హేమ్లా ను ముందుగా బేస్ క్యాంపునకు తరలించి ప్రథమ చికిత్స అందించి, అనంతరం బీజాపుర్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం జవాను పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. -
పేలిన ప్రెషర్ బాంబు.. తెగిపడ్డ కాలు
భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం సరిహద్దులో మారాయగూడెం-గొల్లపల్లి రోడ్డులో ప్రెషర్ బాంబు పేలింది. ఈ ఘటనలో కూంబింగ్ నిర్వహిస్తున్న 217 బెటాలియన్‌కు చెందిన సీఆర్ఫీఎఫ్ జవాను ప్రభాకర్ యాదవ్ తీవ్రంగా గాయపడ్డారు. పేలుడుధాటికి అతని కాలు తెగిపడింది గాయపడిన జవాన్‌ను హుటాహుటిన భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.