కొడుకు ఆత్మహత్య.. వెళ్లలేని స్థితిలో తల్లిదండ్రులు | Indian Student Deceased In England | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్‌లో భారత విద్యార్థి ఆత్మహత్య

Apr 7 2020 11:52 AM | Updated on Apr 7 2020 11:57 AM

Indian Student Deceased In England - Sakshi

మార్చి 15న యూనివర్సిటీ నుంచి బయటకు వెళ్లాడు. తిరిగి రాకపోవడంతో తోటి విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు

లండన్‌ : ఉన్నత చదువుల కోసం ఇంగ్లండ్‌కి వెళ్లిన భారత విద్యార్థి అక్కడ ఆత్మహత్యకి పాల్పడడంతో ఇక్కడ తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా అక్కడికి వెళ్లలేని పరిస్థితిలో ఉన్న వారు.. తమ కుమారుడి మృతదేహాన్ని భారత్‌కు పంపించాలని ఇంగ్లండ్‌ ప్రభుత్వానికి విజ్ఙప్తి చేస్తున్నారు. 

పుణెకు చెందిన‌ సిద్ధార్థ్‌ ముర్కుంబి అనే 23 ఏండ్ల యువ‌కుడు సెంట్రల్‌ లాంక్‌షైర్‌ యూనివర్శిటీలో మార్కెటింగ్‌ కోర్సు చదువుతున్నాడు. మార్చి 15న యూనివర్సిటీ నుంచి బయటకు వెళ్లాడు. తిరిగి రాకపోవడంతో తోటి విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా సోమవారం ఓ నది ఒడ్డున సిద్ధార్థ్‌ మృత దేహం లభించింది. గ‌త నెల మిస్స‌యిన‌ సిద్ధార్థ్‌ ఇప్పుడు నది ఒడ్డున విగతజీవిగా కనిపించడంతో.. అతను ఆత్మహత్య చేసుకొని ఉంటాడని ఇంగ్లండ్‌ పోలీసులు అనుమానిస్తున్నారు. 
(చదవండి : కోవిడ్‌: విషమంగా బ్రిటన్‌ ప్రధాని ఆరోగ్యం)

కాగా, దేశంకాని దేశంలో ఉన్నత చ‌దువు కోసం వెళ్లిన కొడుకు మృతి చెందడం, కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్ కార‌ణంగా ఇంట్లోంచి కాలు బ‌య‌ట‌పెట్టే ప‌రిస్థితి లేక‌పోవ‌డం పుణేలో ఉన్న సిద్ధార్థ్ త‌ల్లిదండ్రులు త‌ల్లడిల్లుతున్నారు. త‌మ కొడుకు మృతదేహాన్ని భారత్‌కు పంపించాలని సిద్ధార్థ్ తండ్రి శంకర్‌ ముర్కుంబి ఇంగ్లండ్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement