కాపురానికి రాలేదని గొంతు కోసి! | Husband Attack On Wife In Kurnool | Sakshi
Sakshi News home page

కాపురానికి రాలేదని గొంతు కోసి!

Aug 6 2018 6:41 AM | Updated on Aug 6 2018 6:45 AM

Husband Attack On Wife In Kurnool - Sakshi

చికిత్స పొందుతున్న భార్య కవిత, చికిత్స పొందుతున్న భర్త

బనగానపల్లెరూరల్‌(కర్నూలు): భార్య కాపురానికి రావడంలేదని గొంతు కోసిన ఓ భర్త కిరాతక చర్య ఆదివారం సాయంత్రం స్థానిక పెట్రోల్‌బంకు సెంటర్‌లో చోటుచేసుకుంది. బాధితురాలి వివరాల మేరకు.. ఉప్పలపాడు గ్రామానికి చెందినబోయ కవితను యాగంటిపల్లె గ్రామానికి చెందిన గోపాల్‌ అనే వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు. భర్త నిత్యం అనుమానిస్తూ, వేధింపులకు గురి చేస్తుండడంతో కవిత భర్త నుంచి విడిగా ఉంటూ కంకర పరిశ్రమలో పని చేస్తూ జీవనం సాగిస్తోంది. ఓ మధ్య వ్యక్తి ద్వారా రామక్రిష్ణాపురం గ్రామానికి చెందిన బాలయోసు అనే వ్యక్తితో ఇద్దరికీ పది రోజుల క్రితం వివాహం చేశారు. బాలయేసు కూడా భార్యపై అనుమానంతో వేధింపులకు గురిచేస్తుండడంతో ఆమె కాపురానికి వెళ్లలేదు.

ఈ విషయంలో పెట్రోల్‌బంకు కూడలిలో భార్యాభర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఆవేశానికి గురైన భర్త బాలయేసు వెంట తెచ్చుకున్న బ్లేడ్‌తో భార్య గొంతు కోశాడు. దీంతో అక్కడే ఉన్న స్థానికులు బాలయేసును చితకబాదడంతో ఆయన కూడా తీవ్రంగా గాయపడ్డాడు. రక్తపుమడుగులో ఉన్న బాధితురాలు కవితను, భర్తను స్థానికులు వెంటనే చికిత్స కోసం స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement