తెలుగు తమ్ముళ్ల ధన దాహం.. చిన్నారుల బలి | Four Children Died Due To TDP Leaders Illegal Sand Transportation | Sakshi
Sakshi News home page

తెలుగు తమ్ముళ్ల ధన దాహం.. చిన్నారుల బలి

Nov 23 2018 3:51 PM | Updated on Nov 23 2018 4:01 PM

Four Children Died Due To TDP Leaders Illegal Sand Transportation - Sakshi

శుక్రవారం ఇసుక తవ్వకాలు జరపటానికి వచ్చిన కూలీలతో పాటు కొందరు చిన్నారులు వారి వెంట చెరువు వద్దకు చేరుకున్నారు. వారు ఇసుకలో ఆడుకుంటుండగా...

సాక్షి, వైఎస్సార్‌ : జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. తెలుగు తమ్ముళ్ల ధన దాహానికి అభంశుభం తెలియని చిన్నారులు బలయ్యారు. తెలుగు తమ్ముళ్ల అక్రమ ఇసుక రవాణా నలుగురు చిన్నారుల ప్రాణాలను బలితీసుకుంది. ఈ సంఘటన వైఎస్సార్‌ జిల్లాలోని గాలివీడు మండలంలోని తలముడిపిలో జరిగింది. అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు తలముడిపి చెరువులో అక్రమంగా ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. విచ్చలవిడిగా ఇసుకను తవ్వి తరలిస్తున్నారు.

శుక్రవారం ఇసుక తవ్వకాలు జరపటానికి వచ్చిన కూలీలతో పాటు కొందరు చిన్నారులు వారి వెంట చెరువు వద్దకు చేరుకున్నారు. వారు ఇసుకలో ఆడుకుంటుండగా మట్టిపెళ్లలు పడి నలుగురు చిన్నారులు మృతి చెందారు. అంత వరకు ఆడిపాడిన చిన్నారులు విగతజీవులుగా మారటంతో వారి కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement