
వైఎస్సార్ జిల్లా: చక్రాయపేట మండలం గండికొవ్వూరు వద్ద నున్న అనంతపూర్ ఎనర్జీ ప్రాజెక్ట్ సోలార్ ప్లాంటేషన్‌లో బుధవారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో సోలార్ సామగ్రి పూర్తిగా అగ్నికి ఆహుతైంది. హైవోల్టేజ్ విద్యుత్ తీగలకు సమీపంలో ఉండటం వల్ల ప్రమాదవశాత్తూ నిప్పు అంటుకుని ఉంటుందని యాజమాన్యం భావిస్తోంది. ఒకే ఒక్క ఫైర్ ఇంజన్‌తో మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కోట్ల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లిందని యజమానులు వాపోతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి