మణిరత్నం సహా 50మందిపై కేసు నమోదు

FIR against  Director maniratnam Aparna Senfor letter to PM Modi on mob lynching - Sakshi

ముజఫర్‌పూర్‌: దేశ రాజకీయాల్లో ఆసక్తిరేపిన 50మంది సెలబ్రిటీల లేఖ అంశంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. దిగ్గజ దర్శకుడు మణిరత్నం సహా పలువురు మేధావులపై దేశద్రోహం కేసు నమోదయింది. మూకుమ్మడి దాడులు, హత్యలపై ఆందోళన వ్యక్తం చేస్తూ దేశంలోని వివిధ రంగాల్లో నిష్ణాతులైన 50 మంది సెలెబ్రెటీలపై  ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బహిరంగ లేఖ రాసినందుకుగాను రామచంద్ర గుహ, మణిరత్నం, అపర్ణా సేన్‌ తదితరులపై దేశద్రోహం కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. న్యాయవాది సుధీర్‌ కుమార్‌ ఓజా దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన చీఫ్‌ జ్యుడిషియల్‌ మెజిస్ట్రేట్‌ సూర్యకాంత్‌ తివారీ ఆదేశాల మేరకు ఈ ఎఫ్‌ఐఆర్‌ నమోదయింది. 

దాదాపు  మూడు నెలల క్రితం దేశంలో అసహనం పెరిగిపోతుందని, మాబ్ లించింగ్ మితిమీరు తున్నాయంటూ అదూర్ గోపాల కృష్ణన్, మణిరత్నం, అనురాగ్ కశ్యప్, శ్యాం బెనగల్‌ అపర్ణాసేన్, కొంకణ్ సేన్ శర్మ, సౌమిత్రా చటర్జీ, రామచంద్ర గుహ, శుభ ముద్గల్ సహా పలువురు సెలెబ్రిటీలు  ప్రధాని మోదీనుద‍్దేశించి  బహిరంగ లేఖ రాశారు.  అయితే దీనికి నిరసనగా సుధీర్‌కుమార్‌ ఓజీ బీహార్ లోని బీహార్ లోని ముజఫర్ నగర్ న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు.  దేశ ప్రతిష్టను మంటకలిపారని, ప్రధాని అద్భుత పనితీరును నాశనం చేసే విధంగా రాసిన లేఖపై 50 మంది ప్రముఖులు సంతకాలు చేశారని  ఆరోపిస్తూ ఓజా కోర్టును ఆశ్రయించారు.  తన పిటిషన్‌ను అంగీకరించిన చీఫ్ జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ సూర్యకాంత్ తివారీ వీరిపై కేసు నమోదు చేయాల్సిందిగా ఆగస్టు 20న ఈ ఉత్తర్వులిచ్చారనీ,  ఈ మేరకు సదర్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదైందని ఓజా చెప్పారు. ప్రధాని మోదీ హయాంలో దేశంలో అసహనం పెరిగిపోతుందంటూ ఏకంగా ప్రధాన మంత్రినుద్దేశించి బహిరంగ లేఖ రాసిన 50 మంది లేఖ రాయడం, ఈ లేఖ వెనుక వామపక్ష భావజాల ప్రభావం వుందని, కమ్యూనిస్టు భావజాలంతోనే వారంతా మోదీని అప్రతిష్ట పాలు చేసేందుకు యత్నించారని కాషాయదళం, దానికి అనుబంధంగా మరో 62 మంది సెలెబ్రిటీలు ఎదురు దాడి లాంటి పరిణామాలు తెలిసిందే.


ప్రముఖ దర్శకుడు మణిరత్నం


దర్శకులు శ్యాంబెనగల్‌, అనురాగ్‌ కశ్యప్‌

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top