విజయవాడలో విషాదం.. మూకుమ్మడి ఆత్మహత్యలు | Family Commit Suicide In Vijayawada | Sakshi
Sakshi News home page

విజయవాడలో విషాదం.. మూకుమ్మడి ఆత్మహత్యలు

Jan 3 2019 6:46 PM | Updated on Jan 3 2019 7:19 PM

Family Commit Suicide In Vijayawada - Sakshi

తన ఇద్దరు కుమార్తెలతో పాటు తాతయ్య వరుసైన గోపాల కృష్ణన్‌తో జయంతి వేలాంగని మాత గుడికి వెళ్లినట్లు...

సాక్షి, విజయవాడ : నగరంలో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకోవటంతో కలకలం రేగింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రాయవేలూరుకి చెందిన క్యాబ్‌ డ్రైవర్‌ ధనశేఖర్‌ భార్య జయంతి(29), కుమార్తె శ్రీలక్ష్మీ(3), పెదనాన్న గోపాల కృష్ణన్‌(65)లు గురువారం విజయవాడలో రైలు కింద పడి ఆత్మహత్యలకు పాల్పడ్డారు. దీంతో కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు విచారణ చేపట్టారు.

గత నెల 27న తన ఇద్దరు కుమార్తెలతో పాటు తాతయ్య వరుసైన గోపాల కృష్ణన్‌తో జయంతి వేలాంగని మాత గుడికి వెళ్లినట్లు పోలీసుల విచారణలో తేలింది. జయంతి పెద్ద కూతురు మహాలక్ష్మి(6) వేలాంగని మాత ఆలయంలోని అతిధి గృహంలో అనుమానాస్పదంగా మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. కాగా జయంతి భర్త, ఇతర కుటుంబసభ్యులు గోపాలకృష్టన్‌పై అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement