ఫేస్‌బుక్‌ మోసగాడు అరెస్టు | Facebook Friend Arrest in Cheating Case karnataka | Sakshi
Sakshi News home page

ఫేస్‌బుక్‌ మోసగాడు అరెస్టు

Aug 7 2019 7:20 AM | Updated on Aug 7 2019 7:20 AM

Facebook Friend Arrest in Cheating Case karnataka - Sakshi

నిందితుడు ప్రమోద్‌

యువతులను పెళ్లి పేరుతో ముగ్గులోకి దించి డబ్బులు లాగేవాడు.

కర్ణాటక, కృష్ణరాజపురం: ఫేస్‌బుక్‌ తదితర సోషల్‌ మీడియాలో నకిలీ ఖాతాలు తెరచి పెళ్లి పేరుతో మాయమాటలు చెప్పి మహిళలను మోసం చేస్తున్న వ్యక్తిని మంగళవారం సీసీబీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. సిద్దాపుర ప్రాంతానికి చెందిన ప్రమోద్‌ అనే వ్యక్తి ఆకాశ్‌భట్‌ పేరుతో ఫేస్‌బుక్‌లో నకిలీ ఖాతా తెరచి యువతులకు, మహిళలకు ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌లు పంపేవాడు. రిక్వెస్ట్‌ అంగీకరించినవారితో తీయగా చాటింగ్‌లు చేసి దగ్గరయ్యేవాడు. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పని చేస్తున్నానని నమ్మించి యువతులను పెళ్లి పేరుతో ముగ్గులోకి దించి డబ్బులు లాగేవాడు. పెళ్లి ఊసెత్తగానే ముఖం చాటేస్తుండడంతో మోసపోయామని గుర్తించిన బాధితులు సీసీబీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితున్ని అరెస్ట్‌ చేసి 60 గ్రాముల బంగారు ఆభరణాలు,ల్యాప్‌టాప్‌ స్వాధీనం చేసుకున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement