భార్యాభర్తల ఆత్మహత్యాయత్నం | Couple Commits Suicide in Anantapur | Sakshi
Sakshi News home page

భార్యాభర్తల ఆత్మహత్యాయత్నం

Oct 19 2019 7:14 AM | Updated on Oct 19 2019 7:14 AM

Couple Commits Suicide in Anantapur - Sakshi

ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వనిత, మణికంఠ

అనంతపురం ,ధర్మవరం రూరల్‌: కుటుంబ కలహాలతో భార్యాభర్తలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... ధర్మవరానికి చెందిన నాగభూషణ కుమార్తె వనితకు చెన్నేకొత్తపల్లి మండలం బసంపల్లికి చెందిన మణికంఠతో తొమ్మిది నెలల క్రితం వివాహమైంది. కొన్ని రోజులు వీరి కాపురం సజావుగా సాగింది. మణికంఠ హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవల భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చాయి. రోజురోజుకూ వీరి మధ్య గొడవ పెరుగుతూపోయింది. ఈ క్రమంలో హైదరాబాద్‌ నుంచి ధర్మవరం వచ్చిన మణికంఠ రైల్వే స్టేషన్‌లో పురుగుమందు తాగి తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి విషయం చెప్పాడు. వెంటనే తల్లిదండ్రులు ఇతరుల సహాయంతో మణికంఠను ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న వనిత భర్తను చూసి అక్కడి నుంచి వెళ్లి తను కూడా పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో ఆమెను కూడా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement