దంపతుల దారుణ హత్య | couple burtal murder | Sakshi
Sakshi News home page

దంపతుల దారుణ హత్య

Jan 2 2018 10:16 AM | Updated on Jul 10 2019 7:55 PM

సాక్షి, కాజీపేట: వరంగల్‌ జిల్లా కాజీపేట మండలంలో దారుణం చోటుచేసుకుంది. ఇంట్లో నిద్రిస్తున్న దంపతులను గుర్తుతెలియని దుండగులు హత్య చేశారు. కాజీపేట మండలం సోమిడి గ్రామంలో సుంచు ఎల్లయ్య, పుల్లమ్మ అనే దంపతులు నివశిస్తున్నారు. సోమవారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు ఇంట్లోకి జొరబడి నిద్రిస్తున‍్న ఎల్లయ్య, పుల్లమ్మలను ఇటుక రాళ్ళతో మోదీ చంపేశారు.

మంగళవారం ఉదయం వారు ఇంట్లోంచి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన ఇరుగుపొరుగువారు తలుపులు నెట్టిచూడగా దంపతులు విగతజీవులై పడిఉండటం కనిపించింది. వెంటనే వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతదేహాలను పోస్టుమార‍్టం నిమిత‍్తం ఆస‍్పత్రికి తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement