డ్యాన్సర్‌పై వేధింపులు.. పబ్‌ యజమానిపై కేసు | Case Filed Against Lisbon Pub Owner Murali Krishna Due To Harassement | Sakshi
Sakshi News home page

లిస్బన్‌ పబ్‌ యజమాని మురళీ కృష్ణపై కేసు నమోదు

Jan 30 2020 1:54 PM | Updated on Jan 30 2020 2:33 PM

Case Filed Against Lisbon Pub Owner Murali Krishna Due To Harassement - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : బేగంపేట్‌లోని లిస్బన్‌ పబ్‌లో మరోసారి వివాదం రాజుకుంది. పబ్‌లోని డ్యాన్సర్‌పై యజమాని మురళీ కృష్ణ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు గురువారం కేసు నమోదైంది. ఈ మేరకు ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఓ డ్యాన్సర్ పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు  నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా ఇటీవల లిస్బన్‌ పబ్‌ తరుచూ వార్తల్లో నిలుస్తోంది. పబ్‌లోకి వచ్చే యువకుల దగ్గర డబ్బులు తీసుకొని వారికి అమ్మాయిలను సరాఫరా చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో పోలీసులు తనిఖీ చేసి యువతను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. (లిస్బన్‌ పబ్‌పై పోలీసుల దాడి.. )

Advertisement
 
Advertisement
Advertisement