లిస్బన్‌ పబ్‌పై పోలీసుల దాడి..  | Police Attack on Panjagutta Lisbon Pub | Sakshi
Sakshi News home page

లిస్బన్‌ పబ్‌పై పోలీసుల దాడి.. 

Dec 19 2019 10:46 AM | Updated on Dec 19 2019 11:15 AM

Police Attack on Panjagutta Lisbon Pub - Sakshi

సాక్షి, హైదరాబాద్: పంజగుట్టలోని లిస్బన్ పబ్‌పై పోలీసులు బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత దాడి చేశారు. నిర్ణీత గడువు దాటిన తర్వాత కూడా పబ్‌లో గానాబజానా సాగుతుండటంతో సమాచారం అందుకున్న పోలీసులు దాడులు నిర్వహించారు. ఫీజు లేకుండానే యువతులను ఉచితంగా పబ్‌లోకి నిర్వాహకులు రప్పిస్తున్నట్టు తెలుస్తోంది.  ముఖ్యంగా గర్ల్‌ఫ్రెండ్‌ లేకుండా వచ్చే యువకులకు పబ్‌ నిర్వాహకులే డ్యాన్సర్ల సరఫరా చేస్తున్నట్టు సమాచారం. ఇదే క్రమంలో యువతుల్ని వ్యభిచారంలోకి దింపి.. డబ్బులు దండుకుంటున్నారని నిర్వాహకులపై ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాకుండా పబ్‌లో డ్యాన్సర్లతో అర్ధనగ్న వస్త్రాలతో, మద్యం మత్తులో నృత్యాలు చేయిస్తున్నారని తెలుస్తోంది. గతంలో ఈ పబ్ ఎదుటే ఓ డ్యాన్సర్‌ను వివస్త్రను చేసిన ఘటన కలకలం రేపింది. తాజా దాడిలో 21 మంది యువతులతోపాటు, 9 మంది యువకులు, ఇద్దరు నిర్వాహకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 1.47 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement